Tuesday, May 10, 2011

Happy to Dada again..




నేను స్టేడియానికి వెళ్ళి క్రికెట్ చూడక దాదాపు ఏడాదిన్నరైంది. స్పోర్ట్స్ రిపోర్టర్‌గా పనిచేస్తున్న రోజుల్లో మీడియా బాక్స్‌లోంచి చాలా మ్యాచ్‌‌లు ఎంజాయ్ చేశాను. కానీ.. జనరల్‌ డెస్క్‌లోకి వచ్చిన తర్వాత క్రికెట్ కోసం స్టేడియం వెళ్ళటం ఇష్టం లేక.. ఇంట్లోనే మ్యాచ్‌లను ఆస్వాదిస్తున్నా. ఇవాళ (5th May,2011) ఎందుకో స్టేడియానికి వెళ్ళి మ్యాచ్ చూడాలనిపించింది. చాలాకాలం తర్వాత మళ్ళీ నా అభిమాన ఆటగాడు బెంగాల్ టైగర్... సౌరవ్ గంగూలీ.. తోటి క్రీడాకారులు, అభిమానులు ముద్దుగా పిలుచుకునే దాదా తిరిగి గ్రౌండ్లో బ్యాట్‌తో కనిపించనున్నాడు. ఇదే సంతోషంలో.. గ్రౌండ్‌కు వెళ్ళాలి, మ్యాచ్ చూడాలి అనుకున్నాను. కానీ ఇంత అర్జెంట్‌గా టికెట్లు ఎలా సంపాదించాలి... అదే టెన్షన్..

The Alchemist (పరుసవేది) novel లో చెప్పినట్లు.. మనకు మంచి జరగాల్సి ఉన్నప్పుడు ప్రపంచం మనకు అనుకూలంగా కుట్ర చేస్తుందన్నట్లు... నేను మనసులో అనుకున్నదే తడవుగా.. ఓ మిత్రుడికి ఫోన్ చేస్తే రెండు ఇవ్వను మూడిస్తాను.. అని 3 టికెట్స్ చేతిలో పెట్టాడు. థ్యాంక్యూ మిత్రమా...

ఇవాళ దాదా ఆడతాడని ముందే తెలుసు. దీంతో.. గ్రౌండ్‌కు వెళ్ళినప్పటినుంచి అన్నీ వింతలే... డెక్కన్ ఛార్జర్స్ ఆడుతున్న మ్యాచులన్నీ empty standsతో కళకళ్ళాడాయి. కానీ ఇవాళ దాదా మ్యాచ్ కావటంతో.. హైదరాబాద్‌లోని గంగూలీ ఫ్యాన్స్ అంతా.. మ్యాచ్ చూసేందుకు తరలి వచ్చారు. (ఏప్రిల్ 24న ముంబైతో జరిగిన మ్యాచ్, మే 5న పూణే వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లకు మాత్రమే స్టాండ్స్ దాదాపు పూర్తిగా నిండిపోయాయి) మ్యాచ్‌కు ముందునుంచే.. హంగామా మొదలైంది. గంగూలీ ప్రాక్టీస్ చేస్తుంటే... ఫ్యాన్స్ ఛీరింగ్‌తో స్టేడియం హోరెత్తింది. టాస్ వేసి జట్టులో మార్పులను యువీ చెబుతుంటే.. గంగూలీ పేరు చదవగానే... మళ్ళీ అదే హోరు.. ప్లేయర్స్‌ ఇంట్రడ్యూస్ చేస్తూ... స్క్రీన్‌లో గంగూలీ ఫోటో రాగానే.. ఫ్యాన్స్ ఛీరింగ్‌తో స్టేడియం మార్మోగిపోయింది.

టాస్ ఓడిన వారియర్స్ ఫీల్డింగ్‌ చేయటంతో.. దాదా గ్రౌండ్లోకి వచ్చినప్పటినుంచి.... తిరిగి పెవిలియన్ వెళ్ళేంతవరకు ఫ్యాన్స్ దాదా జపం చేశారు. వన్‌డౌన్లో దాదా బ్యాటింగ్ వచ్చినపుడు కూడా అదే ఉత్సాహం. ఎక్స్‌ట్రా కవర్స్‌లో ఫోర్, మిడ్‌వికెట్‌‌ మీదుగా సిక్సర్ కొట్టినపుడు ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు. తనదైన ట్రేడ్‌మార్క్ షాట్లతో అలరించిన దాదా.. చివరి వరకు నాటౌట్‌గా నిలిచి వారియర్స్‌ను గెలిపించాడు. ఈ మ్యాచ్ చూడటం నిజంగా నా అదృష్టం. ఇక ఆడడనుకున్న దాదా తిరిగి బ్యాట్ చేతపట్టి రావటం చాలా సంతోషాన్నిచ్చింది. గంగూలీ ఒకట్రెండు ఓవర్లు బౌలింగ్ చేసుంటే బాగుండేదని నా పక్కన ఉన్న చాలా మంది ఫ్యాన్స్ అనుకున్నారు. అది కూడా వాస్తవమే అనిపించింది.


మ్యాచ్ మధ్యలో ఓ అభిమాని స్టేడియంలోకి దూసుకువచ్చి.. దాదా కాళ్ళు పట్టుకున్న సీన్ మ్యాచ్ మొత్తానికే హైలైట్. అతని పేరు నితిన్ దోషి, హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ వాసి, ఆస్ట్రేలియాలో చదువుతున్నాడు. గంగూలీ అంటే వీరాభిమానం. దాదా కాళ్ళ పట్టుకున్న నితిన్, ఒకసారి హగ్ చేసుకుంటానని అడగటంతో.. దాదా కాదన్నాడు. అతన్ని గ్రౌండ్లోంచి ఈడ్చుకొచ్చిన పోలీసులు.. చితగ్గొట్టారు. పక్కనే ఉన్న ఉప్పల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అతన్ని చితగ్గొట్టి బయటకు పంపించినపుడే డౌట్ వచ్చి.. మా ఉప్పల్ రిపోర్టర్‌కు ఫోన్ చేసి విషయం చెప్పి, అలర్ట్‌గా ఉండమని చెప్పాను. స్టేడియం నుంచి ఎవరినైనా పట్టుకొస్తే.. బైట్ తీసుకుని.. పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్... తీసుకొమ్మని చెప్పాను. అనుకున్నట్లుగానే నితిన్‌ను అక్కడికి తీసుకెళ్ళారు. మధ్యలోనే వెహికిల్‌లో కోటింగ్ అయినట్లుంది. మొహం వాడిపోయిందట.. శరీరంపై కొట్టిన దెబ్బలున్నాయి. మా రిపోర్టర్‌కు స్థానిక పోలీసులతో ఉన్న పరిచయంతో.. కాసేపు ఆ అభిమానితో మాట్లాడి బైట్ తీసుకున్నాడు. వెంటనే ఫోన్ చేశాడు. సంతోషం అనిపించింది. ఫీడ్ ఆఫీసుకు ట్రాన్స్‌ఫర్ స్పెషల్.. ఎక్స్‌క్లూజివ్ స్టోరీ (ఈ రోజుకు రెండు సంతోషకరవిషయాలు చాలాకాలం తర్వాత దాదా గేమ్ చూడటం, ఎక్స్‌క్లూజివ్ స్టోరీ దొరకటం)

మ్యాచ్ పూర్తైన తర్వాత బయటకు రాగానే.. చాలా మంది అభిమానులు మాట్లాడుకుంటున్నారు.. డీసీ చెత్త టీమ్.. దీని కోసం ఎవడొచ్చాడు. గంగూలీ కోసమే మ్యాచ్‌కు వచ్చాం purpose serve అయిందనుకుంటూ హ్యాప్పీగా వెళ్లారు. నాకూ అదే అనిపించింది.. లోకల్ ప్లేయర్స్‌ను వదులుకుని కోట్లు పెట్టి కొనుక్కున్న డెక్కన్ ఛార్జర్స్ పై ఎవరికి అభిమానం ఉంటుంది.. కేవలం డీసీ మేనేజ్‌మెంట్‌కు తప్ప. ఏదేమైనా దాదాను మళ్లీ గ్రౌండ్లో చూడటం.. అతని ట్రేడ్‌మార్క్ బ్యాటింగ్ చూడటం.. డీసీ ఓడిపోవటం అన్నీ శుభశకునాలే... జై‌హో దాదా...

No comments:

Post a Comment